తెలంగాణ ఎలక్షన్స్ పై పవన్ చర్చలు!

Sunday, September 9th, 2018, 04:52:18 PM IST

ప్రస్తుతం తెలంగాణాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాయో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఐడియా ఆ పార్టీకి ఏ స్థాయిలో లాభాన్ని ఇస్తుందో గాని ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా మారిందనే చెప్పాలి. టీఆరెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఏకంగా ప్రచారాలను మొదలు పెట్టి ఊహించని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ లో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

మిగతా పార్టీలతో పొత్తులు కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అసలు ఎన్నికల గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. గతంలోనే తెలంగాణాలో కూడా ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పిన జనసేనాని ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్ గా ముందస్తు ఎన్నికల విధానంపై పవన్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) తో సుదీర్ఘంగా చర్చించారు.

మాదాపూర్ లోని పార్టీ కార్యలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం తెలంగాణ శాఖ నేతలు, పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల గురించి పవన్ జనసేన పార్టీ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. చర్చల అనంతరం పార్టీ వ్యూహ రచన గురించి పవన్ నేతలకు క్లుప్తంగా వివరించారు. నెక్స్ట్ సీపీఎం నేతలతో చర్చలు జరిపి పవన్ పోత్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆ పార్టీనేతలతో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments