జనసేనుడి షెడ్యూల్ సిద్ధమైంది.. ప్రత్యేక హోదానే టార్గెట్!

Tuesday, April 3rd, 2018, 09:43:13 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రత్యేక హోదా నినాదం ప్రతి పార్టీల నుంచి వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలంటే ప్రత్యేక హోదానే ఇప్పుడు పెద్ద ప్రయోగం కానుంది. ఆ క్రెడిట్ ఎవరికీ దక్కితే వారే సీఎం అయ్యే అవకాశం ఆఉందని ప్రస్తుత రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి చంద్రబాబు కూడా తన శైలిని మార్చి మరి ప్రత్యేక హోదా కోసం సిద్దమయ్యాడు. అందరిలా కాకుండా తన అధికారంతో ప్రత్యేకా హోదా విషయంలో క్లారిటీ తేవడానికి బాబు ఢిల్లీకి పయనమవ్వనున్నారు.

ఇక జగన్ అయితే తన ప్రజాయాత్రలో ప్రత్యేక హోదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లే వస్తుందని జనాలకు చాలా ఎక్కించేస్తున్నాడు. ఇక జనసేనుడు మాత్రం వీరిద్దరికంటే డిఫెరెంట్ గా తన రాజకీయాన్ని చూపిస్తున్నాడు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ ఈ సారి కొంచెం స్పీడ్ పెంచాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో పర్యటనల ద్వారా ప్రత్యేక హోదా విషయానికి ఊపు తేవడానికి సిద్దమయ్యాడు. బుధ, గురువారాల్లో విజయవాడలో పర్యటించి ఆ తరువాత 4న వామపక్షాలతో ఏకమై హోదా పోరు ప్రణాళికపై చర్చలు జరపనున్నారు. అలాగే ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకాన్ని 5వ తేదీన ఆవిష్కరించనున్నారు. అలాగే జనసేన కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనీ పవన్ పార్టీ సభ్యులతో సమావేశం కానున్నారు. ఇప్పటివరకు తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ప్రెసిడెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments