తెలంగాణలో ఎన్నికలకు జనసేన సిద్దమేనా?

Monday, September 3rd, 2018, 08:26:58 AM IST


తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల టాక్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్పష్టత రాకున్నప్పటికీ తెలంగాణ అధికార పార్టీ నాయకులూ తరచు ఎన్నికల గురించి ప్రస్తావించడంతో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తరహా ఎన్నికలకు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ముందుగానే అలెర్ట్ గా ఉండడం మంచిదని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే సర్వేలు నిర్వహించి నియోజకవర్గ టికెట్ల పంపిణి విషయాల్లో ఆ పార్టీ ఓ నిర్ణయానికి కూడా వచ్చింది.

అసలు విషయంలోకి వస్తే.. జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేది ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని జిల్లాల్లో పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ద్రుష్టి పెట్టారు. తెలంగాణాలో ఇంకా సరైన క్యాడర్ ను సెట్ చేసుకోలేదు. అయితే ఎన్నికల బరిలో మాత్రం జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో రీసెంట్ గా పార్టీ తెలంగాణ ఎన్నికలపై ద్రుష్టి సాధించింది.

సిపిఎం పార్టీతో పొత్తు కుదుర్చుకొని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి సిపిఎం పార్టీ జనసేనతో సన్నిహితంగానే ఉంది. ఇక ఆ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగడానికి సిపిఎం ఆసక్తిని చూపుతోంది. అందులో భాగంగానే రీసెంట్ గా సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులతో జనసేన ప్రతినిధులు నిర్వహించిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి ఇరు పార్టీల వర్గాల వారు చర్చలు జరిపారు. త్వరలోనే ఈ కలయికపై జనసేన నేత నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments