ఎంపీ గల్లా జయదేవ్ కు జనసేన కౌంటర్

Sunday, April 29th, 2018, 09:24:33 AM IST

ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార టిడిపి పైన ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో అలానే సోషల్ మీడియా వేదికగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆంధ్రకు మంచి జరుగుతుంది, రాజధాని నిర్మాణానికి మీ పార్టీ గట్టిగా కృషి చేస్తోంది అని నమ్మి మీకు మద్దతిచ్చాను, కసిని మీరు మా నమ్మకాన్ని వొమ్ము చేశారు, హోదా అడగడానికి కేంద్రం ముందు ఎందుకు భయపడుతున్నారని ఆయన ఇటీవల చంద్రబాబుని నిలదీసిన విషయం తేలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పవన్, వైసిపి అధినేత జగన్ ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవి ఏంటంటే, త్వరలో పవన్,జగన్ అనే సినిమా విడుదల కాబోతోంది, దీనికి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం ప్రశాంత్ కిషోర్, అలానే నిర్మాణ పర్యవేక్షణ మోడీ, అమిత్ షా అని ట్విట్టర్ వేదికగా అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఘాటుగా బదులిచ్చింది. అయ్యా జయదేవ్ గారు, వన్ డే ఇంటర్నేషనల్ మాచ్ లా ఒకరోజు పార్లమెంట్లో ప్రత్యేకహోదా కోసం మాట్లాడి ఆ తరువాత మౌనంగా ఉంటే సరిపోదు, మీకు దమ్ముంటే హోదా పై గట్టిగా ధైర్యంగా పోరాడి సాధించండి మాష్టారు అంటూ సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments