తెలంగాణా అసెంబ్లీ రద్దుపై “జనసేన” కీలక నిర్ణయం..?

Friday, September 7th, 2018, 11:19:30 PM IST

ఇటీవలే తెలంగాణా లో అసెంబ్లీ సమావేశాలు రద్దు అయ్యినట్టు వారు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ విషయం మీద తెలంగాణా లో ఉన్నటువంటి జనసేన పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం అన్నట్టు ఆ పార్టీ కి చెందిన అధికార ప్రతినిధి జి. మహేందర్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో సమావేశాలు రద్దైన విషయం పై వారి రాజకీయ పరిణామాల కమిటి సుదీర్ఘంగా చర్చించాం అని, తెలంగాణలో గల వివిధ పార్టీల బలాబలాపై ఒక అంచనాకు వచ్చి అక్కడ జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో అన్న దాని మీద ఒక నివేదికను రాసి దాన్ని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ శనివారం లేదా ఆదివారం అందిస్తాం అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments