జనసేన నుంచి ఈ ఒక్క ఎమ్మెల్యేను ఉంచుతారా.?

Sunday, May 26th, 2019, 01:20:17 AM IST

2014లో జనసేన పార్టీను స్థాపించినా 2019 వరకు ఆ పార్టీ అధినేత పవన్ క్రమక్రంగా నిర్మించుకుంటూ వచ్చారు.కానీ ఊహించిన స్థాయి విజయాన్ని అయితే పవన్ అందుకోలేకపోయారు.అయినా సరే తన పోరాటం ఆపేది లేదని వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతూనే తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.ఊహించని దెబ్బ తగిలే సరికి పవన్ అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే కోలుకొని పార్టీ తరపున చేసే పనులు చేస్తూ వెళ్తున్నారు.

నిజానికి పవన్ అసెంబ్లీలో అడుగు పెడతారని అంతా భావించినా సరే పోటీ చేసిన రెండు చోట్ల నుంచి కూడా ఓడిపోవడంతో జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ లో గొంతెత్తేవారు లేరా అన్న సందర్భంలో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద రావు గెలుపొంది జనసేన శ్రేణుల కళ్ళల్లో ఆనందం నింపారు.కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎలాగో పార్టీ నుంచి గెలిచింది ఒకరే కాబట్టి ఆ ఒక్కరిని కూడా అధికార పార్టీ లాగేసుకుని అవకాశం ఉంటుందని అప్పుడు జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని అంటున్నారు.కానీ తాజా సమాచారం ప్రకారం అయితే రాపాక వరప్రసాదరావు మాత్రం ఇతర పార్టీలోకి చేరే అవకాశం లేదని తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.కౌంటింగ్ రోజునే కొంతమంది తనకి 15 కోట్లు ఆఫర్ చేసారని కానీ దాన్ని ఆయన తిరస్కరించినట్టు కూడా తెలిసింది.దీనితో జనసేన ఈ ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీలోనే కొనసాగుతారని చెప్పాలి.