జ‌న‌సేన టైమ్ స్టార్ట్ అయ్యిందా.. పార్టీలో చేర‌నున్న మ‌రో ముఖ్య‌నేత‌..?

Saturday, October 20th, 2018, 09:14:02 PM IST

ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఎత్తుక‌లు పై ఎత్తుల‌తో ఏపీ రాజ‌కీయం రంజుగా సాగుతోంది. ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే అధికారం టీడీపీ- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ మ‌ధ్య‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఉండ‌నుంద‌నుకుంటే.. తాజాగా ఈసారి రేసులో మేము ఉన్నామంటూ జ‌న‌సేన కూడా వ‌చ్చి చేరింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి సీయం కుర్చీ నిలిపుకోవాల‌ని టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈసారి అయినా సీయం కుర్చీలో కూర్చోవాల‌ని ఆశిస్తున్నాడు. ఇక తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీయం కుర్చీ పై క‌న్నేశాడు.

అయితే ఇక అసలు మ్మాట‌ర్ ఏంటంటే.. టీడీపీ,వైసీపీల‌లో అసంతృప్త నేత‌లంతా ఈమ‌ధ్య‌ జ‌న‌సేన‌లోకి క్యూలు క‌డుతున్నారు. కాంగ్రెస్ నేత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో మొద‌లైన జ‌న‌సేన‌లో చేరిక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో ముఖ్య‌నేత జ‌న‌సేన‌లోకి రానున్నార‌ని తెలుస్తోంది. ఉత్త‌రాంధ్ర‌లో మంచి పట్టు ఉన్న నేత కొణ‌తాల రామ‌కృష్ణ‌, ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్‌, వైసీపీలో ప‌ని చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత టీడీపీలోకి వెళ‌తార‌ని.. కాదు కాదు మ‌ళ్ళీ వైసీపీలోకి వెళ‌తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా కొణ‌తాల జ‌న‌సేనలో చేర‌నున్నార‌నే వార్త గ‌ట్టిగా విన‌ప‌డుతోంది. అందులో భాగంగానే జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా అయిపోయాయ‌ని త్వ‌ర‌లోనే జ‌న‌సేన తీర్ధ పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని.. జ‌న‌సేన టైమ్ స్టార్ట్ అయ్యింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments