ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దంటూ బాబుకి “జనసేన” హెచ్చరిక..!

Sunday, October 28th, 2018, 05:36:23 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఢిల్లీ పర్యటనలో పడిపోయి తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు లోని గత కొద్ది నెలలుగా ఇక్కడి ప్రజలు ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ మరియు చికెన్ గున్యా వ్యాధులతో అనేక బాధలు పడుతూ ప్రజలు మృత్యువాత పడుతుంటే చంద్రబాబు మరియు అతని క్యాబినెట్ అసలు పట్టించుకోవట్లేదని అసలు వారికేమి పట్ట్టనట్టుగా వీరి సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి చోద్యం చూస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీలోని ఒక్క నేతకి అయినా సరే ఈ ఆంధ్రరాష్ట్రానికి ఆరోగ్య శాఖా మంత్రిని నియమించాలని చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు నారా లోకేష్ గారు కానీ వారి పార్టీ నేతలు అందరిని అడిగేది ఒక్కటే అని మీరు అంతా ప్రజల పక్షాన ఉన్నారా లేదా అని నిలదీశారు.జనసేన పార్టీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి ఉందని,త్వరలో కానీ ఆరోగ్య శాఖా మంత్రిని నియమించకపోతే త్వరలో భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరికలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments