జనసేన ఎవరికీ వ్యతిరేకం కాదు : పార్టీ నేతలు

Monday, April 23rd, 2018, 11:59:20 AM IST

సినీ నటులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రస్తుతం ప్రజా సమస్యలపై దృష్టిపెడుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే తమ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, అయితే అధికారం కూడా తమ లక్ష్యం కాదని, ప్రజల పక్షం నిలవటం, ప్రజలకు జరిగే అన్యాయాలపై అధికార పక్షాలను నిలదీతే తమ ప్రధాన అజెండా అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆదివారం మైలవరం ఎస్వీఎస్‌ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు.

ఈసందర్భంగా జనసేన సెంట్రల్‌ కమిటీ అబ్జర్వర్‌ ముత్తంశెట్టి కృష్ణారావు మాట్లాడుతూ, జనసేనను బలోపేతం చేయాల్సి ఉందని, అందరూ సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా సభ్యత్వ పత్రాలను సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు అందజేశారు. అయితే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయమై అధ్యక్షులు పవన్ నిర్ణయిస్తారని, ప్రస్తుతం పార్టీ బలోపేతం పై దృష్టిపెట్టినట్లు ఆయన చెప్పారు…..

  •  
  •  
  •  
  •  

Comments