ప్ర‌త్య‌ర్థుల్ని టెన్ష‌న్ పెడుతున్న ప‌వ‌న్‌

Wednesday, November 7th, 2018, 09:46:16 AM IST

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూకుడుకు పెంచిన విష‌యం తెలిసిందే. తూర్పు గోదావ‌రి జిల్ల‌ల్లో ప‌ర్య‌టిస్తూ జ‌నాల‌తో మ‌మేక‌మ‌వుతున్న ప‌వ‌న్‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో నెమ్మ‌ది నెన‌మ్మ‌దిగా న‌మ్మ‌కం బ‌ల‌ప‌డుతోందా? అది జ‌న‌సేన‌కు ప్ర‌ధాన బ‌లంగా మార‌బోతోందా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులుఅవున‌నే స‌మాధానం చెబుతున్నారు. కాపులు, బీసీలు , బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల్లో జ‌న‌సేనానికి అంత‌కంత‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇది ఏపీలో ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన నారా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి టెన్ష‌న్ పెడుతోందా? అంటే నిజ‌మ‌నే స‌మాధానం వ‌స్తోంది.

గ‌తంలో పోలిస్తే ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కులాల ప్రాతిప‌దిక‌గా స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. జ‌నం చిన్న చిన్న‌గా జ‌న‌సేన వైపు మెగ్గుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని, జ‌న‌సేన వైపు ప్ర‌జ‌ల మ‌న‌సు మ‌ళ్ల‌డానికి ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గ‌త నాలుగేళ్లుగా అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలే కార‌ణ‌మ‌ని, అదీ కాకుండా గ‌త కొంత కాలంగా తేదేపా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు దూరంగా వుంటుంటే, ప‌వ‌న్ మాత్రం ప్ర‌జ‌ల్లోనే వుంటూ తిరుగుతూ వారి బాధ‌లు వింటూ అండ‌గా నిలుస్తున్నారు. ఏ క‌ష్ట‌మొచ్చినా మీకు నేనున్నాన‌నే భ‌రోసాను బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు క‌లిగిస్తున్నారు. ఇదే ఏపీలో ప‌వ‌న్ గ్రాఫ్ పెర‌గ‌డానికి, చంద్ర‌బాబుతో పాటు, జ‌గ‌న్ ల గ్రాఫ్ ప‌డిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ సైతం జ‌నాల్లో తిరుగుతున్నా .. ప‌వ‌న్‌కి వ‌చ్చినంత స్పంద‌న లేదు.. పైగా అత‌డి అవినీతి రాజ‌కీయాల‌కు జ‌నం విసిగివేసారి పోయార‌న్న మాటా వినిపిస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల‌ని నిషితంగా ప‌రిశీలించిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఏ ఓటు బ్యాంక‌యితే త‌మ‌కు ప్ల‌స్‌గా మారుతుంద‌ని భావించారో అదే ఓటు బ్యాంకు ఇప్పుడు ప‌వ‌న్‌ని న‌మ్ముతుండ‌టం టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల నాటికి ఏపీ రాజ‌కీయ చిత్రం ఎలాంటి మార్పులకు తెర‌తీస్తుందో చూడాలి.