జనసేనాని భారీ కవాతు వల్లనే టీడీపీ క్యాడర్ లో భయం పుట్టిందా..?

Sunday, November 18th, 2018, 03:47:35 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి మాత్రం వచ్చే ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా ఉంటాయని చెప్పాల్సిందే.ఎందుకంటే ఈ సారి మూడు బలమైన పార్టీల మధ్యలో పోటీ నెలకొంది.చంద్రబాబు మరియు జగన్ ల యొక్క సామర్ధ్యాలు బలాబలాలు ఎలా ఉంటాయో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు.వీరి సంగతి పక్కన పెడితే అవ్వడానికి కొత్త పార్టీ అయినా సరే పవన్ యొక్క జనసేన పార్టీకి కూడా అశేషమైన ఆదరణ ఉంది.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా యువత జనసేన పార్టీకి అండగా ఉన్నారని చెప్పొచ్చు.

అయితే గత నెల ధవళేశ్వరం బ్యారేజి మీద పవన్ నిర్వహించిన కవాతుకు ఏ స్థాయిలో జనసేన కార్యకర్తలు హాజరయ్యారో వేరే చెప్పక్కర్లేదు.గోదావరి నదీ జలాల మీద పవన్ నిర్వహించినటువంటి ఈ కవాతు వలన తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో ఒక భయం పుట్టుకొచ్చింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణం గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం కూడా ఒక బలమైన కారణం.పవన్ కి గోదావరి జిల్లాల్లో ఏ స్థాయిలో ప్రజాదరణ ఉందో చెప్పడానికి కూడా ఇదే నిదర్శనం.

పవన్ గాని అప్పుడు వారికి మద్దతు ఇవ్వకపోతే అక్కడ ఖచ్చితంగా వైసీపీయే నెగ్గేదని పవన్ మద్దతు వల్ల అక్కడి లెక్కలు మారాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.ఇప్పుడు పవన్ టీడీపీ కి వ్యతిరేఖం కావడంతో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గోదావరి జిల్లాల్లో పవన్ గెలిచే సీట్లు మాత్రమే కాకుండా ఇతరులకు వచ్చే ఓట్లను కూడా చీల్చే అవకాశం ఎక్కువగా ఉందని అందువల్లనే టీడీపీ అక్కడ ఉనికిని కాపాడుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుందని,అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు వంటివి వారు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.