క‌మ్మ మీడియాకి కౌంట‌ర్ రెడీ!?

Sunday, October 7th, 2018, 08:00:52 AM IST

రాజ‌కీయాల్లో నిల‌బ‌డాలంటే ప్ర‌జా బ‌లం కంటే మీడియా అండ‌నే ప్ర‌ధాన ఆయుధంగా ఉండాల‌ని రాజ‌కీయ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ అందుకు ఆతీతుడేమీ కాదు. పార్టీని బ్ర‌తికించుకోవాలంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కంటే ముందు మీడియా మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని భావించిన ప‌వ‌న్ మీడియా ప‌రంగా త‌న బ‌లాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నాల్లో వున్నాడు. ప‌వ‌న్‌కున్న అభిమాన గ‌ణం గురించి…అత‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అభిమాన గ‌ణంలోని ఓ అభిమాన త‌న అభిమాన హీరో ప‌వ‌న్ కోసం ఓ టీవీ ఛాన‌ల్ ను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

దీనికి తోడు ఓ దిన ప‌త్రిక‌…ఓ జాతీయ మీడియా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌నున్నార‌ని, దీంతో ప‌వ‌న్ రాజ‌కీయాంగా దూసుకుపోయే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుఆ ఓ వార్తా ఛాన‌ల్ వున్న విష‌యం తెలిసిందే. సీపీఐ నేత‌ల చేతుల్లో వున్న టీవీ 99 ను జ‌న‌సేన నాయ‌కుడు తోట‌ చంద్ర‌శేఖ‌ర్ కొనుగోలు చేశాడు. దీనికి తోడు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కూడా వుంది. ఇదీ కాకుండా ఇండియా అహెడ్ ఇంగ్లీష్ ఛాన‌ల్లో గౌత‌మ్ నిర్వ‌హించ‌నున్న ఓ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని కోరుతున్నారు. దీని ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని వెలుగులోకి తేవ‌డానికి ప‌వ‌న్ అంగీక‌రించిన‌ట్లు తెలిసింది.

ఇలా మీడియా ప‌రంగా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టం పార్టీ వ‌ర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. శ్రీ‌రెడ్డిని ఉసిగొల్పి త‌న‌ను మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌నుకున్న వైరి వ‌ర్గాల నుంచి తేరుకున్న ప‌వ‌న్ మీడియా బ‌లాన్ని చేకూర్చుకుంటుండ‌టం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అంగ‌బ‌లం, అర్థ‌బ‌లంతో జ‌న‌సేన‌ను దెబ్బ‌కొట్టాల‌నుకున్న రాజ‌కీయ వ‌ర్గాల‌కు మీడియా ద‌న్నుతో ప‌వ‌న్ బుద్ది చెప్పాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుకు బ‌లాన్ని చేకూరుస్తూ ఓ అభిమ‌ని టీవీ ఛాన‌ల్ ను ప‌వ‌న్ కోస‌మే ప్రారంభిస్తుండ‌టం శుభ‌సూచ‌క‌మ‌ని చెబుతున్నారు. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ చ‌క్రం తిప్ప‌డం ఖాయం అని జ‌న‌సేన వ‌ర్గాలు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.