ప‌వ‌న్ హ‌త్య ప్లాన్‌.. అదో కులం కుట్ర‌?!

Sunday, September 30th, 2018, 09:24:24 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దే ప‌దే త‌న హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించ‌డం వెన‌క స‌హేతుక కార‌ణాల్ని విశ్లేషిస్తే .. అత‌డు అన్న మాట నిజం కావ‌డానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు నివురుగ‌ప్పిన నిప్పులా మారిన వైనం చూస్తున్న‌దే. అక్క‌డ కుల రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌లో పెట్రేగిపోతున్న వైనం క‌నిపిస్తోంది. కులం కోసం కొట్టుకు చ‌చ్చే నాయ‌కులు ఏపీ పాలిటిక్స్‌లో ఉన్నారు. కుల కుంప‌టి రాజేసి ప్ర‌త్య‌ర్థుల హ‌న‌నం సాగించే దుర్మార్గుల‌కు కొద‌వేం లేదు. పైగా రానున్న ఎన్నిక‌లు ఓ అగ్ర‌కులం భ‌విత‌వ్యాన్ని స‌మూలంగా మార్చివేయ‌నున్నాయి. ద‌శాబ్ధాల పాటు రాజ్యాధికారం పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిరిసంప‌ద‌ల్ని దోచుకుంటూ, అక్ర‌మ మార్గాల్లో దాచుకుని ధ‌న బ‌లంతో, రాజ‌కీయ బ‌లంతో ఇత‌ర కులాల పేద‌రికానికి కార‌ణ‌మ‌వుతోంది. పాల‌నాధికారాన్ని గుప్పిట‌ప‌ట్టిన ఒక అగ్ర‌కులం ఇత‌ర కులాల‌న్నిటికీ అతి పెద్ద థ్రెట్‌గానే ప‌రిణ‌మించింది. ద‌శాబ్ధాల పాటు త‌మ హవాకు భంగం క‌ల‌గ‌కుండా.. రాజ్యాధికారాన్ని గుప్పిట ప‌ట్టి ఉంచుకోవ‌డానికి స‌ద‌రు కులం ఎంత‌కైనా తెగిస్తుంద‌న్న సంగ‌తి అంద‌రికీ అర్థ‌మైంది. ఆ క్ర‌మంలోనే ఆ ఒక్క అగ్ర‌ కుల‌నాయ‌కులు .. త‌మ‌కు పోటీ వ‌చ్చే ఇత‌ర అగ్ర‌కుల నాయ‌కుల్ని ఏ కోణంలోనూ బ‌త‌క‌నిచ్చేందుకు ఆస్కారం లేదు. స‌రిగ్గా ఇదే కార‌ణం ప‌వ‌న్ హ‌త్య‌కు దారితీసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ఒక‌వేళ ఏపీ రాజ‌కీయాల్లో జ‌ర‌గ‌కూడ‌ని ప‌రిణామం ఏదైనా జ‌రిగింది అంటే అది ప‌వ‌న్ ప్రాణంతో ముడిప‌డి ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇటీవ‌లి కాలంలో జ‌న‌సేనాని దూకుడు పెంచుతున్న తీరు కానీ, అత‌డు జ‌నంలోకి దూసుకెళుతున్న తీరు కానీ ప్ర‌తిదీ అధికార పార్టీకి సంక‌టంగానే మారింది. ఇక ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీకి కూడా ప‌వ‌న్ నుంచి అతిపెద్ద థ్రెట్ త‌ప్ప‌ద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ల‌క్ష‌ల కోట్ల ఆస్తుల్ని మేట‌లు వేసిన రెండు భ‌ల్లూకాల మ‌ధ్య ప‌వ‌న్ ఒక సాధాసీదా వ్య‌క్తిగా ఉన్నాడు. ఆస్తులు కూడ‌బెట్ట‌లేదు. ధ‌నబ‌లం లేదు. అంగ బ‌లం లేదు. క‌నీసం సెక్యూరిటీ సైతం లేదు. అందుకే ప్ర‌తిసారీ ప‌వ‌న్‌ని ప్ర‌మాద సంకేతాలు వెంటాడుతున్నాయి. ద‌శాబ్ధాల పాటు రాజ్యాధికారం లేక‌, ఉద్యోగ ఉపాధి లేక‌, క‌నీస బ‌తుక్కి కూడా సంపాదించుకోలేని దారుణ స‌న్నివేశంలో కాపులు మిగిలిపోయార‌న్న వాస్త‌వం ఇదివ‌ర‌కూ ముద్ర‌గ‌డ మార‌ణ కాండ‌లో తేలిపోయింది. కాపుల్లో ఆగ్ర‌హావేశాలు ఒక రైలును త‌గ‌ల‌బెడితే త‌ప్ప అస‌లు కాపుల‌ స‌మ‌స్య ఏంటి అన్న‌ది ప్ర‌పంచం గుర్తించ‌లేక‌పోయింది. అంత‌గా ఆ కులం విసిరివేయ‌బ‌డింది. ఆ ఉద్య‌మ‌మే అధికారంలో ఉన్న అగ్ర‌కుల నాయ‌కుడిని భ‌య‌పెట్టింది. త‌మ‌ పార్టీకి ఏపీలో మెజారిటీ భాగం ఉన్న కాపుల వ‌ల్ల గండం త‌ప్ప‌ద‌ని అర్థ‌మైంది. ముద్ర‌గ‌డ ఉద్య‌మం వేళ‌.. కాపుల ఓట్లు త‌న‌కు ప‌డ‌క‌పోతే ఇక‌ త‌న ప‌ని అయిపోయిన‌ట్టేన‌న్న భావ‌న పాల‌నాధీశుల‌కు క‌లిగింది.

విద్య‌, ఉద్యోగం, అధికారం, రాజ‌కీయం అన్ని రంగాల్లోనూ అణ‌గారిపోయిన కాపు వ‌ర్గం ఈసారి ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో త‌మ సామాజిక వ‌ర్గానికి కాపు కాసే ఒక నాయ‌కుడు కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నార‌న్న‌ది క‌ఠోర‌స‌త్యం. ఆ క్ర‌మంలోనే ఏపీలో ఉన్న 3కోట్ల మంది కాపులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో, ముద్ర‌గ‌డ‌లో త‌మ నాయ‌కుల్ని చూసుకోవ‌డం ప్రారంభించారు. అదే స‌మ‌యంలో అధికార పార్టీలో చేరి, వేరొక సామాజిక వ‌ర్గానికి కొమ్ము కాస్తున్న కాపు నాయ‌కుల్ని దూరం పెట్ట‌డం మొద‌లు పెట్టారు. దీన‌ర్థం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంద‌నే. పైగా ప‌వ‌న్ అంత‌కంత‌కు బ‌లం పెంచుకుంటున్న వైనం ఇత‌రుల్ని తీవ్రంగా భ‌య‌పెడుతోంది. అత‌డికి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న ఆ స్థాయిలో ఉంది. ఏపీలో రాజ‌కీయాలు మారాల‌ని ప్ర‌జ‌లంతా త‌పిస్తున్నారు. ఒకే ఒక్క సామాజిక వ‌ర్గం త‌ప్ప ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌న్నీ ఐక్య‌మే ఆ ఒక్క కుల నాయ‌కుల్ని తుంగ‌లో తొక్కేయాల‌న్న క‌సితో ర‌గిలిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వెంటే న‌డిచి ఆ ప‌ని చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. అందుకే స‌రిగ్గా ఈ విశ్లేష‌ణే ఏపీ అధికార పార్టీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. కుల రాజ‌కీయాల‌కు ఆజ్యం పోసి, కులం బ‌లం చూపించాల‌ని త‌పించే స‌ద‌రు కులానికి మూడింది. ఆ ప్ర‌కోపాల్లో భాగంగానే రౌడీ రాజ‌కీయం రావ‌ణ‌కాష్టాన్ని త‌ల‌పించే ఛాన్సుంద‌న్న అంచ‌నాల్ని పెంచుతోంది. రౌడీ రాజ‌కీయాలు, హ‌త్యా రాజ‌కీయాలు ఏపీలో అగ్ర నాయ‌కుల‌కు కొత్తేమీ కాదు. ఈరోజు నేర్చుకోవాల్సిన ఆస్కార‌మే లేదు. అందుకే ప‌వ‌న్ ప‌దే ప‌దే త‌నని హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నార‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ ప‌వ‌న్‌కి జ‌ర‌గ‌కూడ‌నిది జ‌రిగితే అది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార‌ణ హోమానికి తెర‌తీస్తుంది. కేవ‌లం ప‌వ‌న్ అభిమానులు మాత్ర‌మే కాదు, ఇంత‌కాలం విడివిడిగా వేరు కుంప‌టి పెట్టుకున్న‌ కాపులంతా ఏక‌మ‌వ్వ‌డానికి అది ఆజ్యం పోసి ఇక స‌మీప భ‌విష్య‌త్‌లో ఆ ఒక్క అగ్ర‌కులాన్ని అధికారంలోకి రానివ్వ‌కుండా తొక్కేయ‌డం ఖాయ‌మైన‌ట్టే.