మ‌హా మూర్తిపై జ‌న‌సేనాని స్పంద‌న‌!

Tuesday, September 18th, 2018, 01:20:20 AM IST

కాపు సామాజిక వ‌ర్గ పారిశ్రామిక వేత్త‌ల నుంచి జ‌న‌సేనాని పార్టీకి నిధులు క‌లెక్ట్ చేస్తున్నార‌ని ఆరోపించారు మ‌హా టీవీ జ‌ర్న‌లిస్టు మూర్తి. దానిపై స్టింగ్ ఆప‌రేష‌న్ పేరుతో ఏదో చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ప‌వ‌న్‌ని కుల పిచ్చి నాయ‌కుడిగా అభివ‌ర్ణించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్‌ని ప్లాన్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అయితే మూర్తి ఆప‌రేష‌న్ బెడిసి కొట్టింది. అది త‌న ఉద్యోగానికే ఎస‌రు పెట్ట‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

అయితే చానెల్ నుంచి వైదొల‌గాక ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా మ‌హామూర్తి త‌న‌ని తాను హీరోగా చూపించుకునేందుకు తాప‌త్రాయ ప‌డ్డాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పైనా, జ‌న‌సేన పైనా విషం క‌క్కే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే దానిపై జ‌న‌సేనాని స్పంద‌న అంతే సింపుల్‌గా ఉంది. మ‌హా మూర్తిని అన‌వ‌స‌రంగా హీరోని చేయొద్దు.. లైట్ తీస్కోండ‌ని ప‌వ‌న్ అన్నార‌ట‌. పార్టీ నాయ‌కులెవ‌రూ దీనిపై స్పందించ‌వ‌ద్ద‌ని పవ‌న్ సూచించార‌ట‌. ప్ర‌జ‌లే మ‌న నిజాయితీని అర్థం చేసుకుంటారు. వారే నిర్ణ‌యిస్తార‌ని అన్నార‌ట. జనసేన పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు మాట్లాడుతూ – పార్టీ అన్నాక తిట్లు, పొగడ్తలు సహజమని.. ప్ర‌తిదీ భ‌రిస్తామ‌ని అన్నారు. మూర్తి ఏం చేసినా మేలే చేశారు. జ‌న‌సేన‌కు నిధుల అవ‌స‌రాన్ని ఆయ‌నే బ‌హిరంగంగా ప్ర‌క‌టించి మేలు చేశార‌ని అన్నారు. ఆయ‌న‌కు మ‌రింత పాపులారిటీ పెంచ‌డం ఎందుకు? అందుకే ప‌ట్టించుకోమ‌ని అన్నారు. అక్ర‌మంగా సొమ్ములు తీసుకోవ‌డం లేదు, అన్ని పార్టీల లాగానే విరాళాలు సేకరించామని విజ‌య్‌బాబు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వారిలా కాంట్రాక్టుల నుంచి కమీషన్లు, ప్రాజెక్టుల్లో వాటాలు – మైనింగ్ లో డబ్బులు తీసుకోలేదని విమ‌ర్శించారు. స్వచ్ఛందంగా జనసేనకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారినుంచే తీసుకుంటున్నామ‌ని తెలిపారు. జ‌న‌సేన‌కు కులం మ‌కిలి అంటించ‌డం మూర్తి ల‌క్ష్యమ‌ని, అలాంటివాడికి ఇవ‌న్నీ అర్థ‌మ‌వుతాయా? అంటూ జ‌న‌సేన కార్య‌కర్త‌లు స్పందిస్తున్నారు.