దాయాది పాకిస్తాన్ మీడియాలో ప‌వ‌నిజం!!

Saturday, March 2nd, 2019, 10:51:06 AM IST


సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పాకిస్థాన్‌లో భార‌త్ యుద్ధం చేస్తుంద‌ని త‌న‌కు రెండేళ్ల క్రిత‌మే తెలుస‌ని ప‌వ‌న్ అన్న‌ట్టు ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే అంశాన్ని ఉటంకిస్తూ పాకిస్థాన్ జాతీయ ప‌త్రిక డాన్‌లో కీల‌క క‌థ‌నాన్ని ప్ర‌చురించి జ‌న‌సేనా అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరుని మెన్ష‌న్ చేయ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై జాలీయ మీడియా కూడా ఓవ‌ర్‌గా స్పందిస్తుండ‌టంతో జ‌న‌సేనాని రంగంలోకి దిగారు. గ‌తంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్వ‌జ‌య్ సింగ్ అన్న మాట‌ల్ని, పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్తా క‌థ‌నాల్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ మాట్లాడానే కానీ తానకు స్వ‌యంగా స‌మాచారం వుందని మాత్రం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని, ఇలాంటి సున్నిత‌మైన అంశాన్ని రాజ‌కీయం చేయెద్ద‌ని, ఇప్ప‌టికైన‌రా ఆ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఆప‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీడియాను కోరుతున్నారు.

ఈ విష‌యంలో మీడియా సంయ‌మ‌నం పాటించాల‌ని జ‌న‌సేనాని విజ్ఞ‌ప్తి చేశారు. జాతీయ మీడియా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని ప‌తాక శీర్షిక‌ల్లో వాడుతూ ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టింది. దీన్ని సీరియ‌స‌ప్‌గా తీసుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ జాతీయ మీడియాకు విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు చెప్పిన మాట‌ల్ని, కొన్ని వార్తా ప‌త్రిక‌లు ప్ర‌చురించిన క‌థ‌నాల్ని తీసుకుని ఉదాహ‌ర‌ణ‌గా మాత్ర‌మే చెప్పానే కానీ యుద్ధం వ‌స్తుంద‌ని నిజంగా నాకు ఎవ‌రూ చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ బీజేపీపై చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించిన వీడియో క్లిప్‌ను జ‌త చేస్తూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై జాతీయ మీడియా అతి కార‌ణంగా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది. దీన్ని ఉటంకిస్తూ జ‌న‌సేనాని మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. భార‌తీయ మీడియాకు ఓ విజ్ఞ‌ప్తి. త‌ప్పుడు క‌థ‌నాల‌ని ప్ర‌చారం చేస్తూ దేశ ప్ర‌జ‌ల‌ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌కండి అని విజ్ఞ‌ప్తి చేయ‌డం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా ఈ ఉదంతంతో జ‌న‌సేనాని పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుండ‌టం విశేషం.