జనసేన కి ఎదురుదెబ్బ – పార్టీ మారనున్న ముఖ్యనేత

Thursday, March 14th, 2019, 02:51:25 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు జనసేనలో ముఖ్యనేతగా కొనసాగుతున్నటువంటి జనసేన నేత సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన సభ్యత్వానికి పార్టీ జిల్లా కొకన్వీనర్, పార్లమెంట్ మెంబర్ యర్రా నవీన్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తనని సంప్రదించకుండా పవన్ తీసుకున్న నిర్ణయాలపై నవీన్ కాస్త అసంతృప్తితో ఉన్నారంట. తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై నవీన్ ముభావంగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించారని మనస్తాపంతో రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో జరుగనున్న మీడియా సమావేశానికి హాజరై మిగతా వివరాలన్నీ కూడా వెల్లడించనున్నారు యర్రా నవీన్.