జపాన్ చేతిలో హతమైన 300 నీలి తిమింగాలాలు…

Saturday, March 31st, 2018, 08:32:42 PM IST

నీలి తిమింగాలాలను చంపుకు తింటున్న జపాన్‌.. పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఏకంగా 300 నీలి తిమింగలాను వేటాడి, అతిక్రూరంగా చంపింది. అంటార్కిటిక్‌ మహాసముద్రంలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు రాకుండా విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసినట్లు శనివారం జపాన్‌ తనకు తాను ప్రకటించుకుంది. తిమింగలాలపై పరిశోధనల పేరిట గత నవంబర్‌లో మొత్తం ఐదు నావలు దక్షిణమహా సముద్రం నుంచి వేటకి బయలుదేరాయి. అయితే అలా బయలు దేరిన నావలు వెళ్లింది పరిశోధనకు కాదని.. తిమింగాలాలను హతమార్చేందుకని ఘటన చోటు చేస్కున్న తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో జరిగిన ఘటనలపై పలు దేశాలు జపాన్‌ చేష్టలను తీవ్రంగా ఖండించాయి. మొత్తం 333 తిమింగలాలను హతమార్చి వాటి మృతదేహాలను నావల్లో వేసుకుని వచ్చాయి. శనివారం ఉదయం పశ్చిమ జపాన్‌లోని షిమోనోసెకి పోర్ట్‌కు చేరుకున్నాయి. అయితే తిమింగలాల ప్రవర్తన, జీవశాస్త్రీయ అధ్యయనం కోసమే ఈ ఆపరేషన్‌ చేపట్టామని జపాన్‌ ప్రభుత్వం తమ చేష్టలను సమర్థించుకుంటుండగా.. తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమైపోయింది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్‌ ప్రభుత్వం కొనసాగించిన మారణకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. పరిశోధనల కోసం అయితే ఒకటి లేదా రెండు జీవులను మాత్రమే పట్టుకురావాలని కానీ ఒక్కసారిగా ఇన్ని తిమింగాలాలను చంపి ఏం చేద్దామని ఈ ఆపరేషన్ చేసారని ప్రశ్నిస్తున్నారు.