యూట్యూబ్ లో సత్తా చాటుతున్న కాస్ట్లీ స్టార్..!

Saturday, February 9th, 2019, 04:33:39 PM IST

బోయపాటి దర్శకత్వంలో కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన జయ జానకి నాయక సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. మొదటి సినిమా నుండి మాస్ హీరోగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వెయ్యాలని, భారీ బడ్జెట్ సినిమాలతో, పెద్ద సినిమాల తరహాలో అన్ని హంగు ఆర్భాటాలతో తెగ ప్రయత్నిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కు మరోసారి నిరాశే ఎదురైంది. తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే, హిందీలో మాత్రం జయ జానకి నాయక సినిమా పవర్ మాములుగా లేదు.

జయ జానకి నాయక హిందీ డబ్బుడ్ వర్షన్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలైంది, విడుదలైన ఒక్కరోజుకే 9.7మిలియన్ల వ్యూస్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే తెలుగులో నిరాశ పరిచిన సినిమాలో హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టించటం కొత్తేమీ కాదు, గతంలో తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచినా అజ్ఞాతవాసి అక్కడ ఒకరోజులోనే 11మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.