జయలలితకు సింగపూర్ రోబోతో చికిత్స

Sunday, November 27th, 2016, 12:54:53 PM IST

jaya-robo
రెండు నెలలు దాదాపు అరవై ఐదు రోజుల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందారు అంటే ఆమె అనారోగ్యం ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి లో జేరిన దగ్గర నుంచీ మీడియా లో ఆమె ఆరోగ్యం మీద స్పెషల్ బులిటెన్ లు వస్తూనే ఉన్నాయి. ఒక దశ లో కొన్ని మీడియా సంస్థలు ఆమె చచ్చిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. ఆ న్యూస్ లు వచ్చిన కొన్నాళ్ళకి ఆమె ఆరోగ్యం సెట్ అయ్యింది. ఎలాంటి సమస్యా లేదన్న విషయాన్ని తేల్చి చెప్పిన తర్వాత నుంచి జయలలితకు సంబంధించిన వార్తలకు మీడియా ఇచ్చే ప్రాధాన్యత బాగా తగ్గించేశారు. వారానికో.. పది రోజులకో ఆమె తాజా ఆరోగ్య పరిస్థితి గురించి నాలుగు ముక్కలు చెప్పి మమ అని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబితే.. వాటిని అంతేలా వార్తలు అందించే వైనం కనిపిస్తుంది. ఇలాంటి వేళ.. ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
సింగపూర్ నుంచి ఆమె కోసం ఒక రోబోను తెప్పించినట్లుగా చెబుతున్నారు. మైకు సాయంతో ఆమె మాట్లాడుతున్నారని.. 90 శాతం వరకు సహజరీతిలో శ్వాస తీసుకోగలుతున్నారని.. సొంతంగా నడవటమే తర్వాయి అన్నట్లుగా అపోలో ఆసుపత్రి ఛైర్మన్ మాటలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఆమెకు అవసరమైన ఫిజియోథెరపీ చేయటం కోసం సింగపూర్ నుంచి ఒక రోబోను తెప్పించినట్లుగా చెబుతున్నారు. ఫిజియో తరఫీ లో బెస్ట్ అయిన ఈ రోబో ని ఇద్దరు మహిళా ఫిజియో లు తీసుకుని వచ్చారట.