జయలలిత ప్రాణం తీసింది ఐస్ క్రీమా..ఇంకో నాటకమా..!!

Thursday, September 28th, 2017, 06:31:54 PM IST


జయలలిత మరణంపై ఇన్నిరోజులు నోరు మెదపని అపోలో ఆసుపత్రి వర్గాలు తాజాగా ఓ ఆశ్చర్య కరమైన విషయాన్ని వెల్లడించాయి. జయ మరణంపై అపోలో ఆసుపత్రి రిపోర్ట్ ని విడుదల చేసింది. ఈ రిపోర్ట్ అనేక అనుమానాలకు తావిస్తోంది. జయలలిత ఐస్ క్రీం లు తినడం వలన మరణించిందని అపోలో ఆ రిపోర్ట్ లో పేర్కొంది. ఐస్ క్రీమ్ లు తినడం వలన ఆమె షుగర్ లెవల్స్ పెరిగి ఆరోగ్యం విషమించిందని మెడికల్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆ సమయంలో థైరాయిడ్, హైబిపి వంటి సమస్యలో భాదపడుతున్నారని అపోలో తెలిపింది. అమ్మని ఆసుపత్రిలో చేర్చిన సందర్భంలో ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించారు.

ఇన్నిరోజులు జయ మరణం గురించి సరైన కారణాలు వెల్లడించని అపోలో వర్గాలు విచారణ వేగవంతం అయ్యాక ఐస్ క్రీమ్ కారణమని తెలపడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అమ్మ ఆరోగ్య నియమాలు పాటించారా ? ఆ వయసులో కూడా ఐస్ క్రీమ్ లు గట్రా తింటారా ? అని అమ్మ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. విచారణ వేగవంతం అయ్యాక కట్టు కథ లాంటి రిపోర్ట్ ని తయారు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జయ లలిత చికిత్స విషయంలో జరిగిన పరిణామాలని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే రంగం లోకి దిగింది. ఇటీవల గవర్నర్ విద్యాసాగర్ రావు హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలసి రాష్ట్రంలో జరిగుతున్న పరిణామాలని, జయ మరణం వెనుక జరుగుతున్న దర్యాప్తుని వివరించారు. ఆసుపత్రిలో చేరిన రోజు ఉదయం సాధారణంగానే జయ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అసూయాపత్రిలో చేరిన సమయంలో ఆమె సృహలో లేరని మరుసటిరోజు సృహలోకి వచ్చారని అపోలో తెలిపింది. చికిత్స కొద్ది రోజుల తరువాత అమ్మ కోలుకున్నారని త్వరలో డిశ్చార్జ్ అవుతారని కూడా వైద్యులు తెలిపారు. అంతలోనే జయ ఆరోగ్యం విషమించిందని తెలపడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ వివరాలపై తాజాగా కేంద్రం ఆరా తీస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments