షాకింగ్ న్యూస్ : జయలలితకు కూతురు ఉంది!

Saturday, December 2nd, 2017, 08:10:45 PM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పటి నుండి తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా జయలలిత పేరు పై ఉన్న అక్రమాస్తులు కూడా చాలానే బయటపడుతున్నాయి. ఇకపోతే జయలలిత వారసులం తామే అంటూ గత కొంత కాలంగా కొంత మంది తెరపైకి వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక అమృత అనే మహిళ కూడా జయలలిత అసలు కూతురిని తానేనంటూ కావాలంటే డిఎన్ఏ పరీక్షలు కూడా చేసుకోండి అని కోర్టును ఆశ్రయించింది.

అయితే ఆమె వాదనని కొందరు తప్పుపడుతున్నారు. కానీ జయలలిత స్నేహితురాలు గీత మాత్రం ఈ విషయంపై ఎవరు ఊహించని విధమైన కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1999లో ఒక సారి నటుడు శోభన్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకు జయలలితకు పుట్టిన ఒక కూతురు ఉందని ఆయన చెప్పారు. 1996 నుంచి జయలలితతో తనకు సంబంధాలు ఉన్నాయని శోభన్ బాబు చెప్పినట్టు గీత చెప్పారు. అంతే కాకుండా ఆమె పేరు అమృత అని కూడా ఆయన తెలిపారని ఆమె గుర్తుకి చేశారు. ప్రస్తుతం జయ కుమార్తె అని చెప్పుకుంటున్న అమృత అసలైన జయ కూతురు అని కూడా గీత వివరిస్తూ.. ఏదేమైనా డీఎన్ఏ పరీక్షల్లోనే తేలుతుందని ఆమె తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments