వెళుతూ వెళుతూ పన్నీర్ కు పంచ్ ఇవ్వనున్న చిన్నమ్మ..?

Tuesday, February 14th, 2017, 01:01:17 PM IST


తన వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా శశికళ ముఖ్యమంత్రి కాలేకపోయారు. తాజాగా సుప్రీం తీర్పుతో ఆమె 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని కోల్పోయారు.ఇక శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళినట్లే అనే వాదన వినిపిస్తోంది. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోయినా తనపై ఎదురు తిరిగిన పన్నీర్ సెల్వంను గట్టి దెబ్బ కొట్టాలని చిన్నమ్మ భావిస్తోందట. నిన్న గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లిన శశికళ ఇంతవరకు బయటకు రాలేదు. ఆమె సుప్రీం తీర్పు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ఎలాంటి వ్యూహం అమలు చేయాలో తన ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

కాగా పన్నీర్ సెల్వం ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు జయలలిత అన్న కొడుకు దీపక్ ని తెరపైకి తీసుకురావాలని శశికళ భావిస్తోందట. ఈమేరకు కొద్ది సేపటి క్రితమే దీపక్ గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీపక్ ని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళవర్గం ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉంది.మరో వైపు పన్నీర్ సెల్వం వర్గం సుప్రీం తీర్పుతో సంబరాల్లో మునిగింది.జయ మేనకోడలని తమ శిబిరం లోకి చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు పన్నీర్ సెల్వం వర్గం చేస్తోంది. తాజా తీర్పుతో శశికళావర్గం లోని ఎమ్మెల్యేలను తన వర్గంలో చేర్చుకునేందుకు పన్నీర్ ప్రయత్నాలు చేస్తున్నారు.