జయలలిత ప్రెగ్నెంట్ కాదని మద్రాస్ కోర్టు తీర్పు!

Wednesday, July 25th, 2018, 04:46:56 PM IST

2016లో మరణించిన దివంగత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అమృత అనే యువతీ తాను జయ కూతురునని మద్రాస్ హై కోర్ట్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై నేడు తీర్పు వెలువరించిన మద్రాస్ హై కోర్ట్, ఆమె ప్రెగ్నెంట్ కాదని తీర్పునిచ్చింది. కాగా అమృత అందించిన వివరాల ప్రకారం తాను 1980వ సంవత్సరంలో జయకు జన్మించినట్లు చెప్తోంది. దీనిపై దర్యాప్తు జరిపిన పిదప ఆమె తరపు లాయర్ కోర్ట్ కు అమృత జన్మించినట్లు చెపుతున్న తేదికి ఒక నెల ముందు, జయ పాల్గొన్న ఒక ఫిలిం అవార్డు తాలూకు వీడియో ని సమర్పించారు.

ఆ వీడియో ను బట్టి జయ సమయంలో గర్భం దాల్చినట్లు ఎటువంటి ఆనవాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జయ తరపు లాయర్ మాట్లాడుతూ, అమృత చేసేవన్నీ కూడా అసత్య ఆరోపణలు అని, ఆమె ఆస్తికోసమే అమృత ఈ విధంగా నిందలు వేస్తోందని అన్నారు. కావాలంటే జయ తరపు బందువులతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. అయితే కేసును న్యాయమూర్తి మరొక వారానికి వాయిదా వేశారు. కాగా అమృత తన పిటీషలో జయ పార్థివదేహాన్ని బయటకు తీసి ఆమె గర్భం దాల్చారో లేదో తేల్చాలని డిమాండ్ కూడా చేసింది. తదుపరి అమృత సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా సుప్రీమ్ ఆమె పిటీషన్ ను తిరస్కరించింది…..

  •  
  •  
  •  
  •  

Comments