ప్రధానిని కలవనున్న జయలలిత మేనకోడలు…?

Wednesday, December 28th, 2016, 10:37:03 AM IST

jayalalitha-niece
రెండు రోజుల క్రితం వరకు అన్నీ సజావుగా సాగుతున్నాయన్న ఆనందంలో ఉన్నారు శశికళ. కానీ రెండు రోజులనుండి తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు శశికళను అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నీ రెండు రోజులనుండి ఆమెకు ప్రతికూలంగా మారుతున్నాయి. శశికళ వర్గం ఆమెకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని, ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని చూస్తుంది. అయితే ఆమె వ్యతిరేక వర్గం, పన్నీర్ సెల్వం వర్గం ఆమెను ఆ పదవులలో కూర్చోబెట్టడానికి పార్టీ నిబంధనలు అంగీకరించవని చెప్తున్నారు.

శశికళ వ్యతిరేక వర్గం పన్నీర్ సెల్వం లేదా జయలలిత మేనకోడలు దీపను పార్టీ ప్రధాన కార్యదర్శి ని చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీప కూడా మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళ ను ప్రధాన కార్యదర్శి పదవికి ఎలా ఎంపిక చేస్తారని, పార్టీ నియమావళి ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆ అభ్యర్ధికి 5 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదు. 2011 డిసెంబర్లో శశికళను ప్రాధమిక సభ్యత్వం నుండి తొలగించారు. మళ్ళీ తిరిగి 2012 మార్చి జయ వద్దకు చేరారు. అయితే జయ ఆమెకు ప్రాధమిక సభ్యత్వ కార్డును ఇవ్వలేదు. వీటిని పరిగణనలోనికి తీసుకోకుండా నిబంధనలను సడలించి శశికళ మాత్రమే నామినేషన్ వేసేలా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ లో ఫిటీషన్ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వ్యతిరేక వర్గం వారు చెప్తున్నారు. ఈ పరిస్థితులలో జయలలిత మేనకోడలు దీప త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలుస్తారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments