రజినీకాంత్ కు సీనియర్ హీరోయిన్ వార్నింగ్ !

Friday, January 19th, 2018, 02:38:46 PM IST

రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఎవరికి వారు అంచనాలు కట్టేస్తున్నారు. కొందరు రజినీకాంత్ ఎంచుకున్న మార్గానికి మద్దత్తు పలుకుతుంటే మరి కొందరు మాత్రం ఆయన ముళ్ల బాటలోకి అడుగు పెట్టారని అంటున్నారు. ఈ కోవలోకి సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా చేరారు. రజినీకాంత్ తో పాటు కమల హాసన్, రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆసక్తి కలిగిస్తోంది.

వీరిద్దరికి జయప్రద సుతిమెత్తని హెచ్చరిక జారీ చేసారు. రాజకీయాలు సినిమాల్లో నటించినత సులభం కాదని వీరి పై సెటైర్లు సాధించారు. సినిమాలు, రాజకీయాలు పూర్తిగా భిన్నం. ఇక్కడ అడుగడుగునా ముళ్ల, రాళ్ళూ ఎదురవుతాయి. వాటిని దాటుకుంటూ అడుగులు వేయడం చాలా కష్టం అని అన్నారు. ఏది ఏమైనా రజినీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని జయప్రద అన్నారు. జయలలిత మరణం తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యత వీరికి ఉపయోగపడే అవకాశం ఉందని అన్నారు.