వంద శాతం పవన్ కళ్యాణ్ కి మద్దత్తు – జేపీ

Sunday, February 19th, 2017, 02:46:15 PM IST


లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విషయంలో కీలక వ్యాఖ్య చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూ లో జనసేనలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశ రాజకీయాలు మారాలనుకునేవారు, మంచి జరగాలనుకునేవారంతా తనలాగే ఆలోచిస్తారని జేపీ అన్నారు. అలాంటి వారందరికీ తన మద్దత్తు ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు కూడా తన మద్దత్తు ఉంటుందని జేపీ వ్యాఖ్యానించారు.

ఇక్కడ తాను జనసేనలో చేరతానా అనే చర్చ అవసరం లేదని జెపి వ్యాఖ్యానించారు.తనకు పవన్ కళ్యాణ్ కు భావసారూప్యత ఉన్న విషయాన్ని జేపీ అంగీకరించారు. భవిష్యత్తులు తన సలహాలు సూచనలు అవసరమైతే పవన్ కు ఇస్తానని జెపి అన్నారు.పలు సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్.. తనకు జయప్రకాశ్ నారాయణ్ అంటే గౌరవం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల సందర్భంగా జేపీ తరుపున ప్రచారం నిర్వహించాలని తనకు ఉన్నా ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్నందువలన మిత్ర ధర్మం పాటించి ప్రచారం చేయలేదని పవన్ అప్పట్లో అన్నారు.