పవన్ కళ్యాణ్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు: లోక్ సత్తా అధినేత

Friday, February 9th, 2018, 03:54:35 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని ప్రస్తుతం తెలుగు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసిపి – టీడీపీ నాయకులు లోక్ సభలో పోరాటం చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అందరికంటే డిఫెరెంట్ గా ప్రముఖులతో కలిసి పోరాటాం చేయడానికి సిద్దమయ్యాడు. ముఖ్యంగా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణతో ఆయన ఈ రోజు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జేపీ పవన కళ్యాణ్ ఆలోచన చాలా మంచిదని ఆయనను అభినందించారు.

జేపీ మాట్లాతడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆయన్ను హీరోగా చూడటానికి కొన్ని లక్షల మంది డబ్బులిచ్చి వస్తుంటారు. అలాంటిది ఆయన ఏరికోరి కొని కష్టాలు తెచ్చుకుంటున్నారు. అందునా రిటైర్మెంట్ వయసులో కాదు. అలాగని మార్కెట్ లో డిమాండ్ పోయిన తరువాత కాదు. అది నిజంగా చిన్న విషయం కాదు. సమాజం పట్ల గౌరవం ఉండి. మంచి జరగాలనే తపన ఉంటేనే.. మనల్ని పెంచిన సమాజంకు న్యాయం చేయాలని ముందుకు రావడం సాధారణమైన విషయం కాదని అందుకు పవన్ కళ్యాణ్ ని ప్రశంసించి తీరాలని జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. ఒక్కరి ఒక్కరి వల్ల ఈ సమస్య తీరిపోదు. పార్టీలకు అతీతంగా అందరు కలిసి పోరాడితేనే సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చాలా బావుంది. ఆ విధంగా పోరాటం చేయడానికి ముందుకు వెళతామని జేపీ తెలిపారు.