వైఎస్ జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ బ్ర‌ద‌ర్..!

Tuesday, October 23rd, 2018, 10:21:49 AM IST

ఏపీ అధికార టీడీపీ నేత‌ల పై అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మామూలు గానే మైక్ ప‌ట్టుకున్నాడంటేనే త‌న నోటికి ప‌ని చెప్పే ఈ జేసీ బ్ర‌ద‌ర్.. తాజాగా త‌న సొంత పార్టీ నేత‌ల పైనే వ్యాఖ్య‌లు చేసి ర‌చ్చ లేపాడు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. త్వ‌ర‌లోనే ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో వ‌రుస స‌ర్వేలు తెర‌పైకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఏ స‌ర్వేలు తెర‌పైకి రాకపోయినా.. ఈ జేసీ బ్ర‌ద‌ర్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ నేత‌ల పైనే జ్యోస్యం చెప్పాడు.

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేత‌ల్లో దాదాపు 45 శాతం మంది ఎమ్మ‌ల్యేల పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని.. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు గెలిచే అవ‌కాశ‌మే లేద‌ని జేసీ బ్ర‌ద‌ర్ అన్నారు. చంద్ర‌బాబు ముందుగానే మేల్కొని.. వ్య‌తిరేక‌త ఉన్న నేత‌ల్ని మారిస్తే మంచిద‌ని లేక‌పోతే చంద్ర‌బాబు త‌గిన మూల్యం చెల్లించుకోవ‌డం ఖాయ‌మ‌ని జేసీ బ్ర‌ద‌ర్ హెచ్చ‌రించారు. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అభ్య‌ర్ధి ప‌వన్ క‌ళ్యాణ్‌లు రాజ‌కీయంగా క‌లిసే అవ‌కాశ‌మే లేద‌ని.. ఎందుకంటే వారిద్ద‌రి మ‌న‌స్థత్వాలు వేరు వేరు అని.. అయితే రాజ‌కీయాల్లో ఎమైనా జ‌ర‌గొచ్చ‌ని జేసీ బ్ర‌ద‌ర్ అన్నారు. ఇక జ‌గ‌న్ త‌న పార్టీని అధికారంలోకి తెచ్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. జ‌గ‌న్ మ‌న‌స్థ‌త్వ‌మే వైసీపీకి మైన‌స్ అని.. అత‌ను ఒక డిక్టేట‌ర్‌లా ఫీల్ అవుతాడ‌ని.. రాజ‌కీయాల్లో ముందు వెనుక ఆలోచిస్తూ సాగాలని అయితే జగ‌న్‌కు మాత్రం అలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని.. అయితే సీయం కావాల‌నే ఆశ మాత్రం ఉంద‌ని.. అయితే ఆ ఆశ ఈ జ‌న్మ‌లో తీర‌ద‌ని జేసీ బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.