ఎవరికో ఓట్లు వేస్తె ఉద్యోగాలు మేమెందుకు ఇవ్వాలి..?

Wednesday, September 12th, 2018, 12:34:24 PM IST

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి యొక్క తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి తన నోటికి పని చెప్పాడు. తమ సమస్య చెప్పుకుందాం అని ప్రజలు ప్రశ్నించగా వారిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.అనంతపురం జిల్లా సింగనమల నియోగకవర్గంలోని మార్తాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఆ పర్యటనలో అక్కడి ప్రజల పట్ల ఆయన దురుసు ప్రవర్తన చూపించారు.

పర్యటనలో భాగంగా అక్కడి ప్రాంతపు ప్రజలను కలవగా అక్కడి ప్రజలు మీరు మీ ప్రభుత్వం అధికారం లోకి వస్తారు ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని అన్నారు.? ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏమయ్యాయి అని నిలదీశారు. అక్కడి గ్రామం లోని సమస్యలను పరిష్కరించటం లేదు అని వారి ఆవేదనను వ్యక్తం చేసి గత నాలుగున్నర ఏళ్ళు అధికారం లో ఉండగా చెయ్యలేని పనులు ఈ నాలుగు ఏళ్ళల్లో చెయ్యడానికి ఎలా వచ్చారు? అని అడగగా అప్పటికే ఆ ప్రజల ప్రశ్నల వర్షానికి సహనం కోల్పోయిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి “ఎవరికో ఓట్లు వేసిన మీరు మమ్మల్ని ఉద్యోగాలు ఎందుకు అడుగుతున్నారు” అని ఎదురుతూ ప్రశ్నించారు. అక్కడ తాను మాట్లాడింది మాత్రమే వారు వినాలి అని మండిపడ్డారు. ఏది ఏమైనా ఒక ప్రజా ప్రతినిధి ప్రజల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించకూడదు అని విశ్లేషకులు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments