ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా తేల్చుకుందాం..జేసీ దివాకర్ రెడ్డి.!

Saturday, September 22nd, 2018, 09:36:32 AM IST


అనంతపురం తాడిపత్రిలో ప్రభోదానందా స్వామి అనుచరులు స్థానికులు మీద దాడి చేసారన్న గొడవ ఇప్పుడు చినిగి చినిగి చాటంత అవుతుంది.ఎక్కడి నుంచో మొదలయ్యి గొడవ ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది.అక్కడి గొడవల విషయంలో జేసీ దివాకర్ రెడ్డి అక్కడి పోలీసు యంత్రాంగం మీద అతి దారుణంగా దుర్భాషలాడారన్న మాట వాస్తవమే అయితే అవే అనుచిత వ్యాఖ్యలకు అంతే ఘాటుగా అక్కడి కదిరి సీఐ మాధవ్ గారు కూడా సమాధానం ఇచ్చారు.

ఇప్పుడు ఈ గొడవ మాధవ్ vs జేసీ అయ్యిపోయింది.జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను సీఐ మాధవ్ పోలీసులను ఎవరైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వారి నాలుకను తెగ్గోస్తాం అని జేసీ దివాకర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అన్నారు.దీనితో జేసీ ఇంకా రెచ్చిపోయి మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లో సీఐ మాధవ్ మీద విరుచుకుపడ్డారు.నా నాలుక తెగ్గోస్తావా ఎక్కడికి రమ్మంటావ్ చెప్పు వస్తా,ఏ సెంటర్ కి ఐనా సరే వస్తాను నా నాలుక నువ్ ఎలా తెగ్గోస్తావో నేను చూస్తాను అంటూ తీవ్ర స్థాయిలో మంది పడ్డారు.అంతే కాకుండా నువ్ ఖాఖీ చొక్కా తీసిరా నేను కూడా సామాన్య మానవుడి లాగే వస్తాను నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు,ఇప్పుడు ఈ ఇరువురి వ్యాఖ్యలు ఎలాటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో తెలీడం లేదు.