టీడీపీలో మళ్ళీ మొదలైన వర్గపోరు!

Thursday, September 6th, 2018, 12:01:32 AM IST

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ తీవ్రత రోజురోజుకి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అన్ని హామీలను ప్రజలవరకు వెళ్లేలా జాగ్రత్తలు వహిస్తున్నారు. మరోవైపు పార్టీ బలం ఏ స్థాయిలో ఉందనే విషయాలపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే చంద్రబాబు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య వర్గపోరు నడుస్తుండడం తలనొప్పిగా మారింది.

ముఖ్యంగా అనంతపూర్ లో ఎంపీ జెసి.దివాకర్ రెడ్డి, ఎమ్ఎల్ఏ. ప్రభాకర్ చౌదరి మధ్యన రాజకీయ వివాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇదివరకే చంద్రబాబు ఈ విషయంపై ఇరు నేతలతో చర్చినప్పటికీ మళ్లీ జేసి.దివాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రోడ్ల వెడల్పుల విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ అడ్డుపడుతున్నట్లు జెసి తెలిపారు. అంతే కాకుండా ప్రభాకర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెబుతూ.. మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్ తో కలిసి స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అక్రమాలు ఎన్ని జరుగుతున్నా కూడా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అంటూ.. నెలకొన్న సమస్యల గురించి తప్పకుండా సీఎంకు వివరిస్తానని జేసి తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments