అనంత‌పురం జిల్లా బ్రేకింగ్.. చంద్ర‌బాబు పై జేసీ దివాక‌ర్ రెడ్డి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Thursday, October 11th, 2018, 08:00:27 PM IST

ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత టీడీపీ ఎంపీ జేపీ దివాక‌ర్ రెడ్డి గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని విమ‌ర్శిస్తాడో, ఎవ‌రిని పొగుడుతాడో చెప్ప‌డం చాలా క‌ష్టం. మైకు చేతికి వ‌చ్చిందంటే చాలే ఆరోజు ఎవ‌రో ఒక‌రికి మూడింద‌ని అర్ధం. అయితే ఈ విష‌యాలు అన్నీ ఇప్పుడెందుకు అంటారా.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ ఆపిక్ అయ్యాయి.

ముఖ్య‌మంత్రి చంద్రబాబు తాజాగా అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్‌ను చంద్ర‌బాబు ఆవిష్కరించారు. ఈ నేప‌ధ్యంలో అక్క‌డ నిర్వ‌హించిన బహిరంగ సభలో ఈ జేసీ బ్ర‌ద‌ర్ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల జ‌ల్లు కురిపించారు. జేసీ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళుగా నదుల అనుసంధానం గురించి వింటూ వ‌స్తున్నామ‌ని.. అయితే ఆ ప‌నిని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌లేక‌పోయార‌ని.. అయితే చంద్ర‌బాబు మాత్రం చేసి చూపించార‌ని.. చంద్ర‌బాబు మొగోడు అని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి.. పోలవరం ప్రాజెక్టుకు స‌రిగా నిధులు ఇవ్వ‌కుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని జేసీ అన్నారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా చంద్ర‌బాబు మాత్రం అద్భుత‌మైన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ముందుకు వ‌చ్చి.. ఆ ప‌థ‌కాల కోసం కోట్లు వెచ్చిస్తున్నార‌ని.. దీంతో ఆంధ్ర ప్ర‌జ‌ల‌కోసం చంద్ర‌బాబు ఏమైనా ప్రింటింగ్ మిష‌న్ పెట్ట‌రా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు డ‌బ్బు ఎక్క‌డి నుండి వ‌స్తుందో ఖ‌చ్ఛితంగా చెప్పాల‌ని జేసీ బ్ర‌ద‌ర్ చ‌మ‌త్క‌రిస్తూ ప్ర‌శ్నించారు. ఏపీ అభివృద్ధికి ఒక‌వైపు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డుతున్నా.. కేంధ్ర‌ప్ర‌భుత్వం నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నా చంద్ర‌బాబు మాత్రం మొండిగా దూసుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌గా తీసుకెళుతున్నార‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు. దీంతో ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.