జీవీఎల్ పై రెచ్చిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..మాకు అన్ని ఉన్నాయ్..!

Sunday, October 14th, 2018, 01:00:35 AM IST

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులు ఎంతటి సంచలనానికి దారి తీశాయో తెలిసినదే.ఈ విషయం పైన టీడీపీ నేతలకు మరియు బీజేపీ పార్టీ కి చెందిన జీవీఎల్ నరసింహారావు కు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది.ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు ఇంత భయపడుతున్నారని జీవీఎల్,మా మీద కక్ష సాధింపు గానే ఈ దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీ రెబెల్ జేసీ దివాకర్ రెడ్డి జీవీఎల్ పై విరుచుకుపడ్డారు.ఆయనకి తిక్క రేగితే ఎలాంటి వారినైనా లెక్క చెయ్యరన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు కూడా అదే విధంగా బీజేపీ నేతపై విరుచుకుపడ్డారు.ఇక్కడ బతకలేక ఎక్కడికో ఉత్తరప్రదేశ్ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు కూడా మాకు పాఠాలు చెప్తావా అంటూ విమర్శించారు. అంతే కాకుండా మాకు ఎలా బతకాలో తెలుసు,అన్నిటి మీద అవగాహన ఉంది నువ్వేమి కొత్తగా మాకు నేర్పించాల్సిన అవసరం లేదు అని మండిపడ్డారు.నీలాంటి అవగాహన లేని వాడు భయపడతాడు తప్ప మేము మాత్రం భయపడం అని జేసీ తన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు.