ఎన్నికల్లో పోటీపై జేసీ సంచలన నిర్ణయం..!

Thursday, December 6th, 2018, 05:24:01 PM IST

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు, మోడీతో మొదలు పెట్టి జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇలా ఎవరి గురించి అయినా సరే మూక్కు సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటారు. ప్రస్తుతం అనంతపురం రాజకీయాలపై పట్టున్న నేత జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే. ఆయన తాజాగా ఎన్నికల్లో పోటీ చేసే అంశం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. 2019 ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానో లేదో అని అన్నారు జేసీ.

జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ను రాజకీయాల్లోకి తేవాలని గత కొద్దీ కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో జేసీ పవన్ ను ఎంపీగా పోటీ చేయించాలని అనుకున్నాడు, ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో ఇప్పుడున్న అభ్యర్థులకు కాకుండా, తానూ సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే జేసీ ఆశలపై బాబు నీళ్లు చల్లారు. దీంతో కుమారుడి కోసం తానూ పోటీ నుండి తప్పుకొని జేసీ పవన్ ను అనంతపురం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించుకున్నాడు.