తెలంగాణాలో గెలిచేది వాళ్ళే..జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

Thursday, December 6th, 2018, 03:49:23 PM IST

రేపే తెలంగాణలోని ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు తెలంగాణా తో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా తీవ్ర ఉత్ఖంఠ నెలకొంది.ప్రజాకూటమి గెలుస్తుందా లేక తెరాస పార్టీయే మళ్ళీ జెండా ఎగురవేస్తుందా అని ఒక రకమైన ఆసక్తి నెలకొంది.అయితే రేపు తెలంగాణలోని జరగబోయే ఎన్నికల్లో మాత్రం ప్రజా కూటమే గెలిచి తీరుతుందని తెలుగుదేశం ప్రముఖ నేత జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు.

కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి వారి పార్టీకి ఎవరైనా అడ్డొచ్చి డిపాజిట్లు దక్కించుకుంటారా అన్నట్టుగా కెసిఆర్ ఒక చూపు చూసారని,అక్కడే కెసిఆర్ పప్పులో కాలేసాడని జేసీ సంచలనం సృష్టించారు.నామినేషన్ వెయ్యకముందు కెసిఆర్ తనకి అసలు ఇక్కడ తిరుగులేదు అని అనుకున్నాడని,తీరా నామినేషన్ వేసాక కెసిఆర్ కి సీన్ మొత్తం అర్ధమయ్యిందని,తన మీద ఉన్నటువంటి ఎక్కడ లేని తప్పులు అన్ని బయటకి వస్తుండడంతో కెసిఆర్ భయపడుతున్నాడని జేసీ వ్యాఖ్యానించారు.ఇక ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో కెసిఆర్ గెలిచే అవకాశం లేదని అక్కడ ప్రజా కూటమే గెలిచి తీరుతుంది అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.