పవన్ కళ్యాణ్ వస్తున్నాడు..అందుకే పార్లమెంట్ కు వెళ్లిపోతా..!

Tuesday, December 5th, 2017, 03:50:08 AM IST

ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మరో రాజకీయ వారసుడు సిద్ధం అయిపోతున్నాడు. అనంతపురం పొలిటికల్ హీట్ పెంచేలా జేసీ వారసుడు పవన్ రెడ్డి పార్లమెంట్ పై మోజు పెంచుకుంటున్నాడు. ఇటీవలే మా అబ్బాయి పార్లమెంటు కు వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నాడని జేసీ దివాకర్ రెడ్డి పవన్ రెడ్డి గురించి వ్యాఖ్యానించారు. తాజాగా పవన్ రెడ్డి ఈ విషయాన్ని దృవీకరించారు. 2019 ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచన లేదని అన్నారు. ఎంపీగా అయితే ఎక్కువ మందికి సేవచేయవచ్చని అభిప్రాయ పడ్డాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

ఇదే ఇంటర్వ్యూలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి జేసీ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడా లేక పొత్తు పెట్టుకుంటాడా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఒక వేళ టీడీపీ- జనసేన పొత్తు కొనసాగితే అనంత పురంలోని కొన్ని సీట్లు జనసేనకు వెళతాయి. పొత్తుల ప్రక్రియలో ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ స్థానం పై తాను దృష్టి పెట్టడం లేదని పవన్ రెడ్డి అన్నారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా పార్లమెంట్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని అన్నారు. తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ని తాను కలవలేదని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments