ఇక్కడ ఛాన్సుల్లేవు – అక్కడ మాత్రం ఫుల్ బిజీ..!

Thursday, January 10th, 2019, 03:05:40 PM IST

జేడీ చక్రవర్తి, తెలుగులో హీరోగా విభిన్నమైన పాత్రలను చేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. అప్పట్లో వరుస విజయాలు అందుకున్న ఆయనకు తరవాతి కాలంలో అన్ని అపజయాలు ఎదురయ్యాయి దీంతో అవకాశాలు కూడా సన్నగిల్లాయి, ఆ మధ్య అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. దీంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించదలచిన ఆయన ఆ మధ్య రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ, అవి కూడా ఆయనను నిరాశపరిచాయి.అయితే ప్రస్తుతం జేడీ చక్రవర్తి నటుడిగా ఇతర భాషల్లో బిజీగా ఉండటం విశేషం.

తమిళ్ లో జేడీ చక్రవర్తి ప్రస్తుతం “పట్టారై” అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. “మరైందిరుందు పార్కుమ్ మర్మం ఎన్న” అనే మరో తమిళ సినిమాలోను ఒక విలక్షమైన పాత్రను పోషిస్తున్నాడు. మలయాళంలో నివీన్ పౌలి మూవీ “మైఖేల్” లో ఒక స్పెషల్ రోల్ లో జేడీ చక్రవర్తి కనిపించనున్నాడు. కన్నడలోను ఆయన రెండు సినిమాలు చేస్తుండటం విశేషం. మొత్తానికి ఇతర భాషా చిత్రాలతో జేడీ చక్రవర్తి బిజీగానే ఉన్న జేడీకి తెలుగులో కూడా అవకాశాలు వస్తే బాగుండు, జేడీ నటించిన ఇతర బాషా చిత్రాలు సక్సెస్ అయ్యి అతను తెలుగు దర్శకుల కంట పడాలని ఆశిద్దాం.