అన్యాయం చేస్తే పోరాటంలోకి దిగుతా: జేడీ లక్ష్మి నారాయణ

Friday, May 4th, 2018, 04:17:38 AM IST


మాజీ ఐపీఎస్ అధికారి జేడీ.లక్ష్మి నారాయణ పదివి విరమణ చేసినప్పటి నుండి ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి ఆయన వస్తున్నారని గత కొంత కాలంగా అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఇంకా ఏ పార్టీలో తాను చేరలేదని చెప్పారు. అంతే కాకుండా తన నెక్స్ట్ కార్యాచరణ రైతులకు సమ న్యాయం జరిగే విధంగా పోరాడతాను అని చెప్పారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడి రైతులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలు పెడతాము అనే వారికి 50 లక్షల రూపాయల వరకు అప్పులిస్తున్న బ్యాంకులు రైతులకు కనీసం 5 ల్లక్షలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలని, రైతుల సమస్యల గురించి అధ్యాయనం చేసిన తరువాతే తన తరువాత కార్యచరణ గురించి చెబుతానని జేడీ వివరించారు. అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రవరిస్తోన్న తీరుపై స్పందిస్తూ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఒకవేల కేంద్రం అన్యాయం చేస్తే తాను పోరాటంలోకి దిగుతానని లక్ష్మి నారాయణ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments