భవిష్యత్తులో జనసేన చేయబోయేది ఇదే..జేడీ ఫుల్ క్లారిటీ.!

Saturday, June 8th, 2019, 06:47:22 PM IST

అస్సలు జనసేన పార్టీలో ఎవ్వరు గెలిచినా గెలవకపోయినా సరే ఓ ఇద్దరు మాత్రం తప్పకుండా అసెంబ్లీ మరియు పార్లమెంటు సభల్లో వారి గళం బలంగా వినిపిస్తారు అని అంతా అనుకున్నారు.వారే ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అలాగే విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేసిన మాజీ జేడీ వివి లక్ష్మి నారాయణ.వీరిద్దరి గెలుపును అయితే ఎవ్వరూ ఆపలేరు అని అంతా అనుకున్నారు.కానీ అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా ఈ ఇద్దరు ఓటమి పాలవ్వడం జనసేన శ్రేణులకు తీవ్ర నిరాశను మిగిలిచ్చింది.అయినా సరే వీరు మాత్రం ఓటమిని ఆనందంగానే స్వీకరించి వారి పనుల్లో నిమగ్నం అయ్యారు.ఇదిలా ఉండగా పవన్ కూడా ఇక లేట్ చెయ్యకుండా పలు చోట్ల సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీటింగులో జేడీ కూడా పాల్గిన్నారు.ఈ మీటింగులో అసలు జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది అన్న విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.ఎన్నికల్లో ఎలాంటి ధన ప్రవాహం కానీ మధ్య ప్రవాహం కానీ చెయ్యకుండా జనసేన 20 లక్షల ఓట్లు సంపాదించుకుందని ఇదే వారి విజయానికి తొలి మెట్టుగా భావిస్తున్నామని వారు తెలిపారు.అంతేకాకుండా ముఖ్యంగా యువత తమకి చాలా అండగా నిలబడ్డారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో చెప్పారు.గతంలోలా కాకుండా ఈసారి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా అందరినీ చేరుకొని రాజకీయాల్లో ఒక కొత్త వాతావరణం తీసుకువచ్చి స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు చేసే విధంగా వారి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది అని జేడీ స్పష్టం చేసారు.