ధిల్లీ గడ్డపై కర్ణాటక రాజకీయం.. ఏం జరగనుంది..?

Tuesday, May 15th, 2018, 06:54:08 PM IST

దేశంలో ఎన్నడూ లేనివిధంగా కర్ణాటక రాజకీయం రకరకాలుగా రూపాలు మార్చుకుంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం కాస్త రాజ్ భవన్ కు చేరింది. మొట్టమొదటి సారి రాష్ట్ర రాజకీయలు, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న మూడు రాజకీయ పార్టీలకు సరైన మెజారిటీ రాకపోవడంతో ధిల్లీ కోటపై కూర్చున్న గవర్నర్ ను కలిసి నిర్ణయం తీసుకోవడానికి ఈ రాష్ట్ర రాజకీయం మరో కొత్త రూపు దాల్చనుంది. కర్ణాటక రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ కొంచం ముందుగానే అప్రమత్తమై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జేడీఎస్ తో కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల కమిటీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం భాజాపా ముందంజలో ఉండటం వల్ల కేంద్రం కర్ణాటకలో తమకు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకోగా భాజాపా నేతలు ఆనంద కేళిలో సంబరాలు చేసుకున్నారు. ఇక కర్ణాటక రాష్ట్రం కూడా భాజాపా చేతిలోనే అని ధీమాగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల కమిటీ మొదటి రెండు విడుతల్లో వెల్లడించిన ఫలితాలను చూసి జేడీఎస్ తో కాంగ్రెస్ పార్టీ రహస్య అంతనాలు సాగించి ఓ అనూహ్య ఒప్పందం కుదుర్చుకుంది. జేడీఎస్ పార్టీ నుండి ఎవరు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాసరే మా పూర్తి మద్దతు ఇస్తామని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేతలు విషయం ముందుగానే గమనించి తమ నిర్ణయం వెల్లడించారు. అయితే రెండు పార్టీల నేతలు దేశ గవర్నర్ ను కలవడానికి నిర్ణయించుకున్నారని నబీ అజాద్ తెలిపారు. కానీ కాంగ్రెస్ జేడీఎస్ తో కలిసి ఎలాంటి మంతనాలు చేసింది, భాజాపాను కర్ణాటకలో కూల్చడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుందని మాత్రం వేచి చూడాలి. ఇదిలా ఉంటే భాజాపా నుంచి కూడా కొందరు నేతలు గవర్నర్ ను కలవడానికి వస్తున్నట్టు సమాచారం, కానీ కర్నాట రాష్ట్రంలో ఏ పార్టీ గద్దె ఎక్కనుంది, కాంగ్రెస్ జేడీఎస్ సంయుక్త పాలనా, భాజాపా పాలనా, లేక భాజాపా జేడీఎస్ సంయుక్త పాలనా అన్న అంశంపై కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఇదే చర్చ నడుస్తుంది. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే రాష్ట్రంలో ఇన్నిరకాల పరిణామాలు తలెత్తడం ఇదే మొదటి సారి. చివరికి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది.

Comments