రజినీకాంత్ కర్ణాటక రావాలి : కుమారస్వామి కౌంటర్

Monday, May 21st, 2018, 04:55:23 PM IST

ఎన్ని రోజులు గడిచినా ప్రభుత్వం కోర్టులు ఎన్ని కమిటీలు వేసినా కూడా కావేరి నది జలాల సమస్య ఓ కొలిక్కి రావడం లేదు. తమిళనాడు – కర్ణాటక రాష్ట్రాల మధ్య ఊహించని చిచ్చు రేపిన ఈ సమస్య మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇకపోతే ప్రస్తుతం తమిళ నాడులో తారలు రాజకీయ నేతలు కావేరి నీటి గురించే చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయంపై స్పందించారు. కర్ణాటకలో ఏర్పడే కొత్త ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు తీర్పును గౌరవించి నీటిని వదలాలని రజినీకాంత కోరగా కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

రజినీకాంత్ గారు ఒక్కసారి కర్ణాటకకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నీళ్లు ఉంటే తమినాడుకి సందేహం లేకుండా నీళ్లు ఇస్తాం. ఒక్కసారి రజినీకాంత్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని గమనించాలి. ప్రముఖ డ్యామ్ లను ప్రత్యేక్షంగా చూడాలి. అలాగే మా రైతుల పరిస్థితి కూడా అర్ధం చేసుకోవాలి. అప్పుడు మేము నీరు ఇవ్వాలని మీరు అనుకుంటే చర్చలు జరుపుదాం. ఇక్కడి పరిస్థితి చుసిన అనంతరం రజినీకాంత్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని భావిస్తున్నట్లు కుమారస్వామి వివరించారు. ఇక కాంగ్రెస్ అండతో ఈ నెల 23న కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments