జియో మరో సంచలన నిర్ణయం..ఈ సారి స్మార్ట్ ఫోన్లకు దెబ్బ !

Wednesday, January 31st, 2018, 11:24:14 AM IST

టెలికాం రంగంలో జియో అడుగు పెట్టిన తరువాత కొందరు నష్టాలను చూస్తే మరికొందరు లాభాలను చూశారు. జియో ఫ్రీ నెట్ కారణంగా మొదట్లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా పెరిగింది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు తక్కువ ధరకే మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ని అందించడంతో లాభాలు చాలా పెరిగాయి. కొత్త టెక్నాలిజీ కూడా కూడా పెరిగింది. అయితే టెలికమ్యూనికేషన్ కంపెనీలు మాత్రం చాలా వరకు నష్టపోయాయి. ఒక్క ఎయిర్ టెల్ తప్పితే మిగతా కంపనీలు ఏవి జియోకి పోటీని ఇవ్వలేకపోతున్నాయి.

ఇక రిలయన్స్ జియో చాలా రోజుల తరువాత మరొక కొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. గత కొన్ని నెలల క్రితం క్యాష్ బ్యాక్ ల రూపంలో ఉచితంగా జియో ఫోన్లను ప్రవేశపెట్టిన ఈ సంస్థ తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను కూడా అందించదానికి సిద్ధమైంది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ఆధారంగా రెడీ కానున్న ఆ ఫోన్ ధర రూ.1,500ల కంటే తక్కువే ఉంటుందట. తైవాన్ కు చెందిన ప్రముఖ చిప్ సెట్ కంపెనీ మీడియా టెక్ తో ఒప్పందం కుదుర్చుకొని రిలీజ్ చేయనుంది. మొదట కొన్ని లక్షల ఫోన్లను జియో రిలీజ్ చేసి ఆ తరువాత మరికొన్నిటిని ఆర్డర్ ఇస్తారని సమాచారం. ఆ ఫోన్లకు గనక మంచి ఆదరణ లభిస్తే ప్రస్తుతం టాప్ లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు దెబ్బ పడినట్లే అని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.