‘జియోఫోన్‌ 2’.. నాలుగో ఫ్లాష్‌సేల్‌!

Friday, September 7th, 2018, 05:20:08 PM IST

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువవ్వడంతో చాలా మంది ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా బాగా మునిగి తేలుతున్నారు. అందుకు టెలికం కంపెనీల మధ్య పోటీ కూడా టెక్నాలిజీ పెరగడానికి దోహదపడుతోంది. తక్కువ ధరకే ఒకదాన్ని మించి మరోటి మంచి ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. కానీ ఎన్ని వచ్చినా జియో కంపెనీకి గట్టి ఇంకా పోటీని ఇవ్వలేకపోతున్నాయి. ఐడియా అలాగే ఇతర కంపనీలు ప్రస్తుతం దారుణమైన నష్టాలను చూస్తున్నాయి. అయితే ఎయిర్ టెల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ తన కస్టమర్లను తగ్గించుకోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ఇకపోతే రిలయెన్స్ సంస్థ ఈ సారి మొబైల్ కంపెనీలకు మరో సవాల్ విసిరింది. ‘జియో ఫోన్ 2’ కొనాలనుకునే వారి కోసం మరో ఫ్లాష్ సేల్ ని స్టార్ట్ చేయాన్నారట. ఇదివరకే మూడు ఫ్లాష్ సేల్ లని నిర్వహించగా మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు నాలుగోసారి అదే ఫార్మలను ఉపయోగించనున్నారు. ఈ నెల 12వ తేదీన రూ.2999 ధర కలిగిన ఈ ఫోన్లను ఆర్డర్ చేసిన వారికి వారం లోగా అందజేస్తామని సంస్థ ప్రకటన విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఫోన్లను జియో అధికారిక యాప్ లో అమ్మకానికి ఉంచనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments