జియో సంచలన ప్రకటన : జియో ఫోన్-2

Thursday, July 5th, 2018, 01:00:48 PM IST

రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భారతీయ టెలికాం మార్కెట్ లో జియో సిమ్ లు ప్రవేశ పెట్టడం ద్వారా మన దేశంలోని టెలికాం రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు అని చెప్పాలి. జియో రాకతో దాదాపు ప్రతి ఒక్క వినియోగ దారుడికి కాల్స్, ఎస్ఎమ్ఎస్ లు, ముఖ్యంగా ఇంటర్నెట్ టారిఫ్ రేట్లు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే భారతే దేశంలో 20కోట్లకు పైగా ఖాతాదారులను సంపాదించిన జియో సంస్థ నేడు మరొక సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే మార్కెట్ లో బేసిక్ జియో ఫోన్ ను రూ.1500 కు ప్రవేశ పెట్టిన జియో రానున్న ఆగష్టు 15న జియో ఫోన్-2ను మార్కెట్ లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. నేడు ముంబై లో జరిగిన రిలయన్స్ 41వ వార్షికోత్సవ సమావేశంలో, క్వేర్టీ కీప్యాడ్ సహితంగా పని చేసే ఈ ఫోన్ ధర రూ.2999 గా ఉండనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇక ఇప్పటికే వున్న జియో ఫోన్లో అదే ఆగష్టు 15న సామజిక మాధ్యమం వాట్సాప్ ను కూడా అంబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలానే జియో మాన్సూన్ హంగామా క్రింద వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్ లను జియో ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకురానున్నారు. అయితే అది కూడా కేవలం రూ.501కె లభించనుంది. కాగా ఈ ఆఫర్ జులై 21 నుండి అమల్లోకి వస్తుందని అంబానీ తెలిపారు. ఇకపోతే ఎప్పటినుండో మన భారత ప్రజలు ఎదురుచూస్తున్న జియో బ్రాడ్ బ్యాండ్ ను కూడా సంస్థ ముకేశ్ కుమారుడు ఆకాష్ అంబానీ చేతులమీదుగా ఆవిష్కరించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది వాయిస్ ఆధారంగా పనిచేసే సెట్ టాప్ బాక్సు అట. అంతేకాదు ఒక జియో టివి యూజర్ మరొక జియో టివి యూజర్ కి కాల్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో నిక్షిప్తమయి ఉందట…..