క్యాష్ బ్యాక్ ఆఫర్ తో మరో సర్ ప్రైజ్ ఇచ్చిన జియో…

Saturday, March 3rd, 2018, 02:50:14 PM IST

చాలారోజులుగా దిగ్గజ టెలికాం సంస్థలను గడగడలాడిస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ఒక ఆఫర్ పూర్తి కావస్తున్న సమయంలోనే మరో ఆఫర్ అంటూ వినియోగదారులకు ఊరట కలిగిస్తున్న రిలయన్స్ జియో సంస్థ తన ప్రైమ్ మెంబర్ల కోసం గతంలో మోర్ దాన్ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆఫర్‌కు గడువును ఈ నెల 15వ తేదీ వరకు జియో పొడిగించింది. ఇందులో కస్టమర్ల‌కు రూ.700 వరకు విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే వారు రూ.398 లేదా ఆ పైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 100 శాతం క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. సదరు రూ.700 క్యాష్‌బ్యాక్‌లో రూ.400కు 8 ఓచర్లు వస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలపై వాడుకుని ఈ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక మిగిలిన రూ.300 క్యాష్‌బ్యాక్ జియో పార్ట్‌నర్స్‌ అయిన డిజిటల్ వాలెట్స్ ద్వారా యూజర్లకు లభిస్తుంది. ఫ్రీ చార్జ్, మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పేలలో ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments