రూ. 685 కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహా.. అంబానీ మహిమే..!

Thursday, February 23rd, 2017, 04:03:32 PM IST


ముఖేష్ అంబానీ తీసుకొచ్చిన జియో వలన భారత ప్రభుత్వానికి రూ 685 కోట్ల నష్టం వాటిల్లిందంటే నమ్మగలరా..కానీ ఇది అక్షరాలా నిజం. గత సెప్టెంబర్ నుంచి ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తున్న జియో వలన భారత ఆర్ధిక వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. నిర్దేశించిన సమయానికంటే ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తుండడంతో తాము నష్ట పోవలసి వస్తోందని టెలికాం శాఖ ప్రకటించింది.ఈమేరకు టెలికాం రంగ సంస్థలు నష్టపోకుండా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని టెలికాం శాఖ ట్రాయ్ కి సూచించింది.

జియో ప్రకటించిన ఆఫర్లతో భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా, ఐడియా వంటి సంస్థలు వాటి రెవెన్యులు కోల్పోయాయి. కంపెనీల రెవెన్యుల ఆధారంగానే ప్రభుత్వం వాటి నుంచి స్పెక్ట్రమ్ చార్జీలు, లైసెన్సు ఫీజులను వసూలు చేస్తుంది.జియో ఒత్తిడిని తట్టుకోవడానికి ఆయా సంస్థలు కూడా భారీ ఆఫర్ లను ప్రకటించి నష్టపోయాయి. దీనితో వాటి రెవెన్యూలు గత మూడు నెలల కాలంలో కనిష్టస్థాయికి పడిపోయాయి. తద్వారా భారత ప్రభూత్వం రూ 685 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.దీనితో భారత ప్రభుత్వం టెలికాం రంగ నియంత్రణ శాఖకు ట్రాయ్ కి ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషన్ లకు సంబందించిన టారిఫ్ లలో నిభందనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.