బ్రేకింగ్ న్యూస్ : దాచేపల్లి బాలిక అత్యాచారంపై పవన్ సంచలన ట్వీట్

Friday, May 4th, 2018, 02:00:08 AM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన దారుణ ఘటనపై జనసేన స్పందించింది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన “కథువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా, పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకి గురువుతోంది. ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసును కలిచివేసింది, నిస్సహాయతకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన బిడ్డకి, వారి కుటుంబానికి నిలబడాలని కోరుకుంటున్నాను. అసలు ఆడబిడ్డపైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితులు రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని నేను కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

కాగా.. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గుంటూరు వాసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠిన శిక్షవిధించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాదు సుబ్బయ్యను పట్టిస్తే నగదు బహుమతి ఇస్తామని సీఎం ప్రకటించడం జరిగింది. మరోవైపు పరారీలో ఉన్న సుబ్బయ్య గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ఫోన్ నంబర్లతో సహా మీడియాకు చెప్పారు.