అనంతపురం జేఎన్టీయూ వీసీ దుర్మరణం !

Wednesday, February 22nd, 2017, 06:45:34 PM IST


పామిడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ ఎం.ఎం సర్కార్ దుర్మరణం చెందారు. ఆయన కారుని జాతీయ రహదారిపై లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వీసీ పీఏ ఫక్రుద్దీన్, కారు డ్రైవర్ ప్రసాద్ కూడా మృతి చెందారు.

వీసీ మరియు కారు డ్రైవర్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా ఆయన పీఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతపురం జిల్లా గుజరామ్ పల్లి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. 44 వనంబర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా, కారు లారీ ఎదురెదురుగా రావడంతో ఈ ఘోర ఘటన జరింగింది. కేసు నమోదు చేసిన పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.