పవన్ కళ్యాణ్ పై జర్నలిస్ట్ ల ఫైర్…..కేసు నమోదు?

Thursday, April 26th, 2018, 03:14:24 PM IST

ఇటీవల శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయమై చేసిన రచ్చ అంత ఇంత కాదు అని చెప్పాలి. ఆమె వేషాలకోసం వచ్చే తెలుగుఅమ్మాయిల పై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే వాదన తెరపైకి తేవడంతో, టాలీవుడ్ లో కొంతవరకు అలజడి మొదలయింది. అయితే మొదట తెలుగు అమ్మాయిల సమస్యల పై తాను పోరాటం చేస్తాను అన్న శ్రీరెడ్డి, చివరికి ఈ విషయం పై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎన్నో గొడవలకు కారణభూతం అవుతోంది. ముఖ్యంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అయన తల్లిని ఉద్దేశించి విపరీతమైన పరుష పదజాలంతో దూషించడం పలు వివాదాలకు తావిస్తోంది. ఐతే తాను పవన్ పై చేసిన ఆ అనుచిత వ్యాఖ్యలు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ చేయించారని, ఆయన అలా అనమంటేనే తాను అన్నట్లు శ్రీరెడ్డి తన కో ఆర్టిస్ట్ తమన్నా తో ఇటీవల ఒక ఆడియో టేప్ లో బయటపెట్టింది.

అయితే తరువాత రాంగోపాల్ వర్మ కూడా ఒక వీడియో విడుదల చేస్తూ పవన్ ని కానీ ఆయన తల్లి గారిని కానీ అనాలనేది తన ఉద్దేశ్యం కాదని, అయినా జరిగిన తప్పుకు తానే పూర్తిగా కారణమని, కావున పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్లు ఆయన వీడియో లో తెలిపారు. నేను క్షమాపణ చెప్పినప్పటికీ పవన్ ఫాన్స్ నన్ను దూషించడం సరైనది కాదని వర్మ అంటున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఈ విషయమై ఫిలిం ఛాంబర్ కు వెళ్లిన పవన్ తనను, తన తల్లిని అంత నీచమైన మాటలతో తిడుతుంటే మీడియా వారు అవి పదే పదే ప్రసారం చేయడం తనకు బాధ కలిగించిందని అన్నారు. అందుకే తాను ఈ విషయమై న్యాయపరంగా కోర్ట్ కి వెళ్లనున్నట్లు, త్వరలో ఆ మీడియా చానెల్స్ పై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఆ తరువాతనుండి ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పలు మీడియా చానెల్స్ సంస్థల అధినేతల మీద తనవద్దనున్న కొన్ని ఆధారాలతో వారి తప్పులను ఎత్తి చూపుతూ పోస్ట్ లు పెట్టారు.

ఈ ఘటనపై నేడు జర్నలిస్ట్ సంఘాల వారు హైదరాబాద్ సిసిఎస్ పోలిస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. ట్వీట్లతో పవన్ ఫైర్ కావటంపై టీయూడబ్ల్యూజే నేత క్రాంతికిరణ్ మండిపడ్డారు. పవన్ అర్ధం పర్ధం లేకుండా అదేపనిగా ట్వీట్లు చేస్తూ మీడియా ని కట్టడి చేయాలనీ చూస్తున్నారని, అసలు ఆయన ఆ ట్వీట్లు తాగి పెడుతున్నారో లేక ఏదైనా డ్రగ్స్ తీసుకుని పెడుతున్నారో తెలియడం లేదని ఆయన విమర్శించారు. ఈ విధంగా ప్రవర్తిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుండి పంపి వేయాలనికూడా వారు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. అయితే క్రాంతి కుమార్ పవన్ పై తాగి ట్వీట్ చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుని చేస్తున్నారా అని అనడం సరైనది కాదని, తన తల్లిని అంటే ఏ బిడ్డా ఊరుకోడని, ఒక భారతీయుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా మీడియా చేసిన తప్పుల పై ప్రశ్నించే హక్కు పవన్ కు ఉందని ఆయన అభిమానులు మద్దతు పలుకుతూ ట్వీట్స్ చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments