ఒకే ఓవర్లో 37 పరుగులు.. న్యూ రికార్డ్ !

Saturday, January 20th, 2018, 05:57:06 PM IST

ప్రస్తుత రోజుల్లో సెంచరీ చేయడం కన్నా మ్యాచ్ ఓడిపోతున్నపుడు సిక్సుతో విజయాన్ని అందించవాడే ప్లేయర్. ఈ సూత్రాన్ని ప్రతి దేశం ఆటగాళ్లు చాలా ఏకాగ్రతతతో అమలుపరుస్తున్నారు. మ్యాచ్ ఏదైనా సరే సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తిచ్చే వాడే అసలైన క్రికెటర్ అని క్రికెట్ అభిమానులు అంటుంటారు. ఇక ఎవరి టాలెంట్ అయినా సరే అవసరం అయినప్పుడే బయటపడుతుందని సౌత్ ఆఫ్రికా ఆటగాడు జేపీ డుమిని తన ఆటతో నిరూపించాడు. ఎవరు ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 37 పరుగులను వచ్చేలా చేసి రికార్డ్ సృష్టించాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా వన్డే టోర్నీలో భాగంగా జరిగిన ఒక లీగ్ మ్యాచ్ లో డుమిని టార్గెట్ ను తొందరగా అందుకోవాలని ప్రత్యర్థి ఆటగాడు ఎడ్డీ లీ వేసిన ఓవర్లో ఏకంగా 37 పరుగులను రాబట్టాడు. మొదట నాలుగు బంతులను సిక్సర్లుగా మలచిన డుమిని ఐదో బంతికి రెండు పరుగులు చేశాడు. చివరగా బౌలర్ నో బాల్ వేయడంతో డుమిని దాన్ని ఫోర్ కొట్టాడు. ఇక నో బాల్ కారణంగా వేసిన ఏడవ బంతిని డుమిని సిక్సర్ కొట్టి సరికొత్త రికార్డు సృటించాడు. జట్టు గెలవడానికి ఓవర్లు బాగానే ఉన్నా డుమిని ఫాస్ట్ గా ఆడాడు. బోనస్ పాయింట్ కోసమే అలా ఆడాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం మీడియాకు వివరించాడు.